Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీగా పోటీ చేస్తానంటున్న కత్తి మహేష్.. అంత సీనుందా...?

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీపీఠం మఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిపై విమర్శలు చేసి హైదరాబాద్ న

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (14:48 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీపీఠం మఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిపై విమర్శలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయ్యారు. ఇపుడు విజయవాడలో ఉంటున్న కత్తి మహేష్.. సంచలన ప్రకటన చేశారు.
 
రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దళిత జాతికి అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నూతన దళిత నాయకత్వం కోసం జిల్లాల పర్యటన చేస్తున్నానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని.. దళిత హక్కులను కాపాడే పార్టీకి మద్దతిస్తానని కత్తి మహేష్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రటించారు. 
 
రాజకీయాల్లో నేతలు పరిణతి చెంది ఉండాలన్నారు. ప్రతి విషయంలో వెనుకడుగు వేయడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటని విమర్శించారు. ఇటీవల జరిగినవి పరువు హత్యలు కావని, కుల ఉన్మాద హత్యలని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని కత్తి మహేష్‌ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments