Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో 'పందెం కోళ్లు'లా మెగా బ్రదర్స్... ఏంటి సంగతి?

మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఒక్కరేనని ఎప్పుడూ చెబుతుంటారు తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఇద్దరూ ఒక్కటే. సినీ పరిశ్రమలో ఒకరిన

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (21:22 IST)
మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఒక్కరేనని ఎప్పుడూ చెబుతుంటారు తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఇద్దరూ ఒక్కటే. సినీ పరిశ్రమలో ఒకరిని చూసి ఒకరికి అవకాశం రాదు కానీ.. ఎవరు టాలెంట్ వారిదేనన్నది అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరికి ఉన్న గుర్తింపు గురించి అస్సలు చెప్పనవసరం లేదు. 
 
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, పవన్ కళ్యాణ్‌ జనసేనతో ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లో బిజీబిజీగా పర్యటనలు కొనసాగించారు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి వేర్వేరుగా కర్ణాటక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారట. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం నిర్వహిస్తుండగా, జెడీఎస్ తరపున పవన్ కళ్యాణ్‌ ప్రచారం చేయనున్నారు. తెలుగు యాక్టర్లను కన్నడ రాష్ట్రంలో తీసుకెళితే ప్రయోజనం ఏం ఉంటుందని అనుకోవచ్చు. అస్సలు కథ ఇక్కడే ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులోనే కర్ణాటక రాష్ట్రం ఉంది. తెలుగు హీరోల ప్రభావం ఈ రాష్ట్రంపై బాగానే ఉంది. అందుకే వీరిని రంగంలోకి దింపుతున్నారు ఆయా పార్టీల ముఖ్య నేతలు.
 
అన్నదమ్ములు వేర్వేరుగా ప్రచారం చేస్తే ఒకరికి ఒకరు ఎలాంటి ప్రసంగాలు చేస్తారోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు చిరంజీవి ప్రచారం చేయాల్సిన రూట్‌ను కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. వీరి ప్రచారం మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments