ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ ప్రభుత్వ విప్ అల్లుడు

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (09:18 IST)
manjunath reddy
ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే (రాయదుర్గం) కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి అనుమానాస్పందంగా మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ నెంబర్ 101లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మంజునాథ్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. 
 
మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి పేరు మహేశ్వర్ రెడ్డి. మంజునాథ్ రెడ్డి తండ్రి వైసీపీలో ఉన్నారు. 
 
అంతేకాదు పీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థను నడుపుతున్నారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని... బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
 
ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments