Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ మైనర్ యువతిని పెళ్లాడిన కనిగిరి వాసి.. పాస్ పోర్టు లేకపోవడంతో?

బంగ్లాదేశ్ యువతిని కనిగిరి వాసి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆమె మైనర్ కావడంతో పాటు పాస్ పోర్టు లేకపోవడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కనిగిరి ప్రాంతంలో నివాసం ఉండే బెంగా‌ల్‌కు చెందిన బాలకృష్ణ అనే

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (17:34 IST)
బంగ్లాదేశ్ యువతిని కనిగిరి వాసి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆమె మైనర్ కావడంతో పాటు పాస్ పోర్టు లేకపోవడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కనిగిరి ప్రాంతంలో నివాసం ఉండే బెంగా‌ల్‌కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు సదరు యువతిని వివాహం చేసుకుని తీసుకొచ్చాడు. పాస్‌పోర్టు లేకపోవడంతో యువతిని అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని జట్రాబరి అనే గ్రామానికి చెందిన స్వీటీ మండల్‌ అక్కడ ఇంటర్‌ చదువుతూ సయ్యద్‌ ఇస్లాం సుమన్‌ బహరీ అనే యువకుడుని ప్రేమించి నాలుగు నెలల క్రితం పెళ్ళి చేసుకుంది. ఆ వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు బెంగాల్‌కు చెందిన బాలకృష్ణతో ఈనెల 16న బెంగాల్‌లో వివాహం చేశారు. సదరు బాలకృష్ణ కొంత కాలంగా వినుకొండ, కనిగిరి ప్రాంతాల్లో ఆర్‌ఎంపీగా పనిచేస్తూ ప్రస్తుతం కనిగిరిలో ఉంటున్నాడు. 
 
బెంగాల్‌లో స్వీటీ మండల్‌ను పెళ్ళి చేసుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి ఈనెల 26న ఒంగోలు వచ్చారు. సదరు యువతికి ఇక్కడ భాష సమస్య కాగా పోలీసులు తొలుత బాలకృష్ణను విచారించారు. బెంగాల్‌కు చెందిన యువతిని తాను వివాహం చేసుకొచ్చానని చెప్పారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు బహరీని  కోర్టులో హాజరు పరిచగా బంగ్లాదేశ్ అమ్మాయిని చైల్డ్ హోమ్‌కు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments