Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌గుడికి ఎవ‌రు కాప‌లా? ఈ శున‌కాల‌కే అప్ప‌జెప్పేశారా?

విజ‌య‌వాడ ‌: బెజ‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి కాప‌లా ఎవ‌రు? ప్రధాన ద్వారం వ‌ద్ద సిబ్బంది విధుల్లో లేకున్నా.. ఆలయంలో రక్షణగా కాపలా పర్యవేక్షిస్తున్న ఈ శునకాన్ని చూశారా? ఇంద్రకీలాద్రిపై కనీస రక్షణ చర్యలు కరువైపోతున్నాయి. ఆలయ ఈవో ఉంటే ఒకలాగా, లేకుంటే మరోలా

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (14:08 IST)
విజ‌య‌వాడ ‌: బెజ‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి కాప‌లా ఎవ‌రు? ప్రధాన ద్వారం వ‌ద్ద సిబ్బంది విధుల్లో లేకున్నా.. ఆలయంలో రక్షణగా కాపలా పర్యవేక్షిస్తున్న ఈ శునకాన్ని చూశారా? ఇంద్రకీలాద్రిపై కనీస రక్షణ చర్యలు కరువైపోతున్నాయి. ఆలయ ఈవో ఉంటే ఒకలాగా, లేకుంటే మరోలాగా ఇక్కడ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారంలోనే రక్షణ కరువైపోతోంది. ఉద్యోగులు ఎలాగూ ఉండటంలేదని, శునకాలే భ‌ద్ర‌త పర్యవేక్షిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8:56 గంటలకు దుర్గగుడిలోని పరిస్థితి ఇది. 
 
శుక్రవారం రాత్రి ఈవో సుమారు 8:30 గంటలకు గుడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత ప్రధాన ద్వారంలో గేటు దగ్గర  కాపలా సిబ్బంది లేరు. దేవాలయాలకు రక్షణ పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేటు సెక్యురిటీని ఏర్పాటు చేస్తున్నా, దుర్గగుడిలో మాత్రం ప్రైవేటు సిబ్బంది పనితీరు స‌రిగా లేదు. రాత్రి గుడి తెరిచి ఉన్న సమయంలోనే సిబ్బంది కాపలా లేకుంటే? అమ్మవారి ఆలయానికి రక్షణ ఎలా వుంటుందనే విమర్శలు వస్తున్నాయి.
 
ప్రైవేటు సెక్యూరిటీతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా విధుల్లో ఉండాల్సి ఉంది. అయితే  రాత్రి 8:56 గంటలకు అటు ఎస్పీఎఫ్ సిబ్బంది గాని ప్రైవేటు సెక్యూరిటీ గాని ప్రధాన గేటు దగ్గర లేరు. అదే సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో మాత్రం శునకం పర్యవేక్షిస్తోంది. అక్కడ కొద్ది దూరంలోనే లడ్డూలు విక్రయించే చోట ప్రైవేటు సిబ్బంది దురుసుతనానికి అడ్డు అదుపు లేదు. వంద  రూపాయలు ఇచ్చి లడ్డు కావాలని అంటే, వెళ్లి చిల్లర పట్టుకురా... అంటూ వెకిలిగా సమాధానం చెపుతున్నారు. చిల్లర వున్నా లడ్డు ఇవ్వటానికి నిరాకరించడంతో ఆలయ ఈవోకు ఫోన్ చేస్తే కానీ, లడ్డూ ఇవ్వని పరిస్థితి. ప్రైవేటు వ్యక్తులకు ప్రధాన భాద్యతలు అప్పగిస్తే ఆలయానికి జవాబుదారీ ఎవరు ఉంటారో అధికారులే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments