Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల పంపకాలపై కమల్‌నాథన్ కమిటీ గైడ్‌లైన్స్ ఏపీ వెబ్‌సైట్‌లో!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (17:26 IST)
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కొన్ని గైడ్‌లైన్స్‌ను ఏపీ ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఉంచింది. 
 
కాగా, ఈ కమిటీ ఖరారు చేసిన గైడ్‌లైన్స్‌లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని, ఆర్టికల్ 371డి ప్రకారం ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే అక్కడే స్థానికత వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. 
 
ఒంటరి మహిళ, భార్యభర్తలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని, రెండేళ్ళలో రిటైరయ్యేవారికి ఆప్షన్లు లేవని కమల్‌నాథన్ కమిటీ పేర్కొంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 10 రోజుల్లోగా వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా పాల్గొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments