Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం లేని గ్రామాల్లేవ్.. చంద్రబాబు టెండర్లు వేయిస్తున్నారు: జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 27 జనవరి 2016 (19:20 IST)
మద్యం షాపులు లేని గ్రామాల్లో సైతం వాటిని ఏర్పాటు చేసేందుకు తమ మనుషులతో ఏపీ సీఎం చంద్రబాబు టెండర్లు వేయిస్తున్నారని వైకాపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే మద్యం షాపులనేవి లేకుండా చేస్తామని జగన్ అన్నారు.
 
కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, యూనివర్శిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయని విషయంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా.. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం షాపులు లేకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
 
'ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను చొక్కా పట్టుకుని నిలదీయండని జగన్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో ఇంటరాక్షన్‌కు ముందు జగన్ ప్రసంగించారు. ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా? అని ఏపీ సర్కార్ దిక్కుమాలిన ఆలోచన చేస్తోందని, ఆరోగ్య మిత్ర ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. పీహెచ్‌డీలు చేసిన వారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments