Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ''కాకబలి''

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (13:56 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే ''కాకబలి'' కార్యక్రమం శుక్ర‌వారం వైదికోక్తంగా జరిగింది.
 
ఉదయం 3 గంటలకు తోమాలసేవ, కొలువు మధ్యలో కాకబలిని అర్చక స్వాములు నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.
 
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు శుక్ర‌వారం ఉదయం అలంకరించారు.
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియ్యార్‌స్వామివారి మఠానికి శుక్ర‌వారం ఉదయం చేరుకున్నాయి.

అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుండి మంగళవాయిధ్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌ స్వామి, శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు,  ఎవిఎస్వో శ్రీ గంగ రాజు, ఇత‌ర ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments