Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరి ప్రాణాలు తీసిన 'అరవింద సమేత'... మరో ఇద్దరికి గాయాలు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (16:19 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో తమ భాషను, జీవితాల్ని కించపరిచారని జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపించారు.
 
ఆ తర్వాత వీరు ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని సొంతూరుకు వెళ్లిపోయారు. బుధవారం మరో ఛానల్‌లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ముగ్గురు తీవ్రంగాగాయపడ్డారు. 
 
'వారి ప్రయాణం తుంగభద్రానదిని దాటి కొంత దూరం సాగింది. హఠాత్తుగా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం నుజ్జునుజ్జయింది. జలం శ్రీను అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన బహుజన ఉద్యమంతోపాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు' అని వారు స్నేహితులు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments