కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాకు చుక్కెదురు.. టీడీపీ రవి రికార్డు విజయం
కడప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి చుక్కెదురైంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎ
కడప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి చుక్కెదురైంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తొలి రౌండ్ నుండి ఉత్కంఠను కొనసాగించాయి. తొలి రౌండ్‌లో టిడిపి అభ్యర్థి బీటెక్ రవిపై వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
రెండో రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్థి నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి టిడిపి అభ్యర్థి బీటెక్ రవి తన సమీప వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
34 ఏళ్ళ తర్వాత కడప జిల్లాలో వైఎస్ కుటుంబసభ్యులను ఓడించి టిడిపి అభ్యర్థి రవి చరిత్ర సృష్టించారు. వైకాపాకు కంచుకోటగా నిలిచిన కడపలో విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన టీడీపీ కృషి ఫలించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో వైసిపిపై ఆధిపత్యాన్ని సాధించింది.