Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... ర్యాగింగ్ కాదు లెక్చరరే కీచకుడు... ప్రేమ పేరుతో వేధించి.... ఫోటోలతో బ్లాక్ మెయిల్...

నంద్యాల ‌: నంద్యాల ఆర్.జి.ఎం.కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌లో కొత్త కోణం వెలుగు చూసింది. కాలేజీలో కుర్రాళ్ళ ర్యాగింగ్ వ‌ల్ల ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని తొలుత అంద‌రూ భావించ

Webdunia
నంద్యాల ‌: నంద్యాల ఆర్.జి.ఎం.కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌లో కొత్త కోణం వెలుగు చూసింది. కాలేజీలో కుర్రాళ్ళ ర్యాగింగ్ వ‌ల్ల ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని తొలుత అంద‌రూ భావించారు. కానీ, ఈ కిరాత‌కానికి ఒడిగ‌ట్టింది కాలేజీలోని ఒక లెక్చ‌ర‌రే అని సమాచారం. బుద్ధిగా పాఠాల చెప్పాల్సిన లెక్చర‌ర్ ఆమెను ప్రేమ పేరుతో వేధించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఉషారాణి ఆర్.జి.ఎం. కాలేజీలో ఇంజ‌నీరింగ్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతోంది. కుంద‌న‌పు బొమ్మ‌లా ఉన్న ఆమె కాలేజీలో చేరిన‌ప్ప‌టి ఓ లెక్చర‌ర్ ఆమెపై క‌న్నేశాడని సమాచారం. ఉషారాణి ఉంటున్న హాస్ట‌ల్ లోని రూమ్‌మేట్స్‌ని మ‌చ్చిక చేసుకుని, వారితో సెల్ ఫోన్లో ఉషను అశ్లీల ఫోటోలు తీయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలతో ఆమెనే బ్లాక్ మెయిల్ చేసి, లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశాడనీ, లెక్చర‌ర్ వేధింపులను త‌ట్టుకోలేక ఉష నంద్యాల నుంచి త‌న స్వగ్రామానికి బ‌ద్వేలుకు బయలుదేరింది. ఐతే మార్గ‌మ‌ధ్య‌మంలోనే పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఉష‌ను వెంటనే కడప ఆసుపత్రికి తరలించారు. ఆయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
 
ఐటీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న ఉష త‌న స‌న్నిహితుల‌తో ఈ సంగ‌తి చెప్పుకొంద‌ని స‌మాచారం. చివరకు ఎటూ పాలుపోక ప్రాణత్యాగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అన్నిటికీ మించి ఉష ఓ ప్రజాప్రతినిధికి చెల్లెలు. బద్వేలు జడ్పీటీసీగా ఉన్న శిరీషకు ఉష స్వయానా చెల్లెలు. ఓ ప్రజాప్రతినిధి చెల్లెలికే కాలేజీల్లో రక్షణ లేనప్పుడు ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌ని అమ్మాయిల‌ త‌ల్లితండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments