Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవి లేదా రూ.100 కోట్ల ఆఫర్‌.. ఎవరికి ఎవరు ఆఫర్ చేశారు?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:55 IST)
విజయవాడలో మంచిపట్టున్న నేతగా వంగవీటి రాధాకు గుర్తింపు ఉంది. ఈయన వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అలాంటి వంగవీటి రాధాకు ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ.పాల్ నుంచి ఊహించని ఆహ్వానం వచ్చింది. 
 
తన పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో రూ.100 కోట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేగానీ, తెలుగుదేశం పార్టీకి మాత్రం అమ్ముడు పోవద్దని ఆయన ప్రాధేయపడ్డారు. అదేసమయంలో తాను స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణను ఆయన ఆహ్వానించారు.
 
ప్రజాశాంతి పార్టీలో చేరితే తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చలేకపోతే రూ.100 కోట్లు చెల్లిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తండ్రిని చంపిన టీడీపీలో చేరితే వంగవీటి రాధాకృష్ణను కాపులు జీవితంలో క్షమించరని డాక్టర్ పాల్ హెచ్చరించారు. 
 
కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధా.. రాష్ట్ర విభజన తర్వాత వైకాపాలోకి వెళ్లారు. కానీ అక్కడ కూడా నిలదొక్కులేకపోయారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నిజానికి వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగాను తెలుగుదేశం పార్టీ నేతలు హత్య చేయించారనే ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments