Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని వర్గాల వారికి న్యాయం... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (08:05 IST)
అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పని చేస్తుందని, మంత్రివర్గ కూర్పు నుంచి అన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 
 
ఆదివారం హోటల్ ఐలాపురంలో ఏపీ కమ్మర శాలివాహన కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలని లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
 
40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు నమ్మి అధికారమిస్తే... అభివృద్ధి చేయకుండా మాటలతో మోసం చేశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.  అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్సార్ సిపి నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, కమ్మర శాలివాహన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
 
కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,  ఎమ్మెల్యే జోగి రమేష్ , ఎన్ వి కృష్ణారావు, బొమ్మిడి శ్రీనివాస్,  దుర్గాప్రసాద్ గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నాయకులు  వెంకట్రామయ్య, కమ్మర శాలివాహన కృష్ణా జిల్లా, విజయవాడ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments