Webdunia - Bharat's app for daily news and videos

Install App

11వ తేదీ నుంచి జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాలు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:24 IST)
మార్చి 11వ తేదీ నుంచి 21వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల పోస్టర్ ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ , జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. 12వ తేదీ ధ్వజారోహణం, 16వ తేదీ గరుడోత్సవం, 19న రథోత్సవం,  20న చక్రస్నానం, 21వ తేదీ పుష్ప యాగం నిర్వహిస్తామన్నారు.

టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
 
బుగ్గ‌లోని టిటిడి ఆల‌యానికి కానుక‌గా వెండి నాగాభ‌ర‌ణం
టిటిడి ఆధ్వ‌ర్యంలోని బుగ్గ‌లో గ‌ల శ్రీ అన్న‌పూర్ణ స‌మేత కాశీవిశ్వేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి వెండి నాగాభ‌ర‌ణం కానుక‌గా అందింది. తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ అంజ‌ని, డాక్ట‌ర్ ర‌విశేఖ‌ర్‌రెడ్డి ఈ మేర‌కు 1.76 ల‌క్ష‌ల విలువైన ఈ ఆభ‌ర‌ణాన్ని ఆల‌య సూప‌రింటెండెంట్ ర‌మేష్‌కు అంద‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments