Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (11:47 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి గతంలో ఓ టీవీ చర్చా కార్యక్రమం జరిగింది. ఇందలో పాత్రికేయుడు కృష్ణంరాజు 'వేశ్యల రాజధాని' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ శనివారం మరో వీడియోను విడుదల చేశారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 'జగనన్న కనెక్ట్స్' అనే సామాజిక మాధ్యమ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయకపోగా, అమరావతి పరిసర ప్రాంతాల్లోని మహిళా రైతులపై మరోసారి బురదజల్లే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
శుక్రవారం సాక్షి టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్లుగా కృష్ణంరాజు ఈ వీడియోలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తాను ప్రస్తావించానని తెలిపారు. 
 
"నేను దీన్ని ప్రస్తావిస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాను. అమరావతిలో అనలేదు" అని వీడియోలో పేర్కొన్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో అధికారులను అడిగితే వాస్తవాలు చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఈ వీడియోలో కృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డిపై జరుగుతున్న ట్రోల్స్‌ను ఖండించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన వైసీపీ పట్ల తన విధేయతను చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమరావతి ప్రాంత మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం