Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్. జ‌గ‌న్‌పై జీవితా రాజశేఖర్ దంపతులు ఆస‌క్తిక‌ర కామెంట్స్..!

Webdunia
శనివారం, 25 మే 2019 (15:27 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జ‌గ‌న్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఎన్నికల ఫలితాలు, ప్రచార సరళిపై జీవితా రాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ... ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మేం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. అందువల్ల, పార్టీ తరపున ఎక్కువ సమయం ప్రచారం చేయడానికి వీలుకాలేదు. అయినప్పటికీ... 10 -15 రోజుల పాటు వీలైనన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాం. 
 
గాజువాక, గన్నవరం, నందిగామ, భీమవరం, విజయవాడ తదితర నియోజకవర్గాల్లో పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించాం. మేం ప్రచారం చేసిన పలు చోట్ల, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వైయస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయానికి జగన్ పూర్తిగా అర్హులు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఆయన విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఏపీ ప్రజలకు ప్రామిసింగ్ లీడర్ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన హయాంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకు వెళుతుంది.
 
వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు జగన్‌ని ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నుకొనే విధంగా ఆయన పాలన ఉండబోతోని బలంగా విశ్వసిస్తున్నాం. మేమింత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే... ఆయనతో మాట్లాడినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలనుకుంటున్నారో వివరించారు. ఆయన చెప్పినవన్నీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కి జగన్ ప్రత్యేక హోదా తీసుకు వస్తారని మేం బలంగా నమ్ముతున్నాం. అలాగే, కేంద్రంలో నరేంద్ర మోడీ విజయం సాధించడం సంతోషంగా ఉందని వారు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments