Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి- జేడీ లక్ష్మీ నారాయణ

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (14:35 IST)
ఎన్నికల ముందు జనసేన పార్టీలో తాను చేరడానికి గల కారణాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. 'జనసేన పార్టీలోకి ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే. జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌. జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటు కొనబోమని చెప్పారు. నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి. మీరొస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు. 
 
పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్‌ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం' అని తెలిపారు.
 
 
 
'పొలీట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుటుందన్నాను. మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి. ఎక్కువ మంది మదనం చేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. 
 
ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నాకు ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను' అని చెప్పారు. పార్టీలో ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పారు. అందరూ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. అప్పుడే నిర్ణయాన్ని అమలు చేయడంలో అందరూ చురుకుగా పాల్గొంటారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments