జేసీ సోదరులు మాట్లాడే మాటలు సంచలనాత్మకంగా వుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ మోహన్ రెడ్డేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఈ దారుణానికి తెగబడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు తమను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సీఎం ఎలా కాపాడుతున్నాడో జగన్ మోహన్ రెడ్డి నిరూపించాలంటూ ప్రశ్నాస్త్రం సంధించారు.
జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనీ, కానీ ఆయన జీవితాంతం ఆ పదవిని చేపట్టలేరని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, తనే ముఖ్యమంత్రిని అవుతానంటూ జగన్ మోహన్ రెడ్డి రోడ్లపై పిచ్చోడిలా తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.