Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం అభివృద్ధి కోసం కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా... జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అదేసమయంలో ఆ పనులు అడ్డుకుంటే జుట్టు పట్టుకుని ఉతకడానికి కూడా సిధ్ధమేనని ప్రకటించ

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (09:31 IST)
అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అదేసమయంలో ఆ పనులు అడ్డుకుంటే జుట్టు పట్టుకుని ఉతకడానికి కూడా సిధ్ధమేనని ప్రకటించారు. అనంతపురం అభివృద్ధి చర్యల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు ముందుకు సాగకుండా కొందరు అడ్డుకుంటున్నారు. 
 
దీంతో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం అభివృద్ధికి ఎమ్మెల్యే, కమిషనర్, మేయర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
 
వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అనంతపురం అభివృద్ధి కోసం తాను ఎవరి కాళ్లయినా సరే పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. 'అవసరమైతే చేతులు పట్టుకుంటా... లేదంటే కాళ్లు పట్టుకుంటా.. అదీకాకపోతే జుట్టు పట్టుకుని ఉతికైనా సరే అనంతపురాన్ని బాగుచేసుకునేందుకు సిద్ధంగా ఉన్న'ట్టు ప్రటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments