Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాలు కోరితేనే కొత్త నవోదయ విద్యాలయాలు... భ‌వ‌నాలు మీవే!

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (18:07 IST)
రాష్ట్రాలు కోరితేనే కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్వీ) స్థాపన జరుగుతుందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యుడు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటును కోరే రాష్ట్రాలు శాశ్వత భవన నిర్మాణాలకు తగిన భూమిని ఉచితంగా సమకూర్చాల‌న్నారు. శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు విద్యాలయం నిర్వహణకు అవసరమైన తాత్కాలిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వమే అద్దె లేకుండా ఉచితంగా సమకూర్చాలని అన్నారు.
 
 
అయితే కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు, ప్రారంభం అనేది సంబంధింత ప్రాధికార సంస్థ అనుమతి, అందుకు తగిన నిధుల అందుబాటు ప్రాతిపదికపై మాత్రమే జరుగుతాయని మంత్రి చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2014 మే 31 నాటికి జేఎన్వీ పథకానికి సమ్మతి తెలిపిన అన్ని జిల్లాలు జవహర్ నవోదయ విద్యాలయం పరిధిలోకి వచ్చాయని మంత్రి వెల్లడించారు. 2018కు ముందుగా మంజూరైన 21 విద్యాలయాలు 2020 నాటికి ప్రారంభం అయ్యాయ‌ని,  ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు జవహర్‌ నవోదయ విద్యాలయం పథకం పరిధిలో ఉన్నాయ‌ని వివ‌రించారు. అదనంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒకటి, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి చొప్పున స్థాపించినట్లు మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments