Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎస్‌తో జపాన్ కౌన్సల్ జనరల్ భేటీ

Webdunia
సోమవారం, 29 జులై 2019 (20:18 IST)
జపాన్ కౌన్సల్ జనరల్ కొజిరో ఉచియామా సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కనుక తగిన భూమిని సమకూర్చగలిగితే డిడికేటెడ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన మౌళిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారం అంశంలో తూర్పు తీరంలోని భారత దేశంలోని ఆంద్రప్రదేశ్ రాష్ట్రం జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యతా డెస్టినేషన్ పాయింట్ గా భావిస్తున్నట్టు జపాన్ కౌన్సల్ జనరల్ కొజిరో ఉచియామా సీఎస్ కు వివరించారు. అదే విధంగా జఫాన్ భారతదేశంలో 3వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారని తెలిపారు.  మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ పుడ్ జపాన్(ఎంఎఎఫ్ఎఫ్) ప్రస్తుతం ల్యాండ్ స్కేఫ్ ఎనాలిసిస్ త్రూ మిజుహి ఇన్పర్మెషన్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి,ఆహార శుద్ధి మరియు ఫిషరీస్ సెక్టార్లో మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

అంతేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్డు స్టోరేజి, వేర్ హౌసింగ్, సోర్సింగ్ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, తాజిస్టిక్స్ టు కనక్టవిటీ టు మార్కెట్స్ అండ్ ఇతర మౌలిక సదుపాయాలకు తోడ్పాటును అందించేందుకు జపాన్ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్పారు.  అదేవిధంగా సిస్టర్ స్టేట్ ఒప్పందం విత్ టొయామా పెపక్చర్ లో భాగంగా గత 2015 అక్టోబరు లో జపాన్, ఆంధ్రప్రదేశ్ లమధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు.

ఆర్ధిక,విద్యా, సాంస్కృతిక మరియు పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి కృషి చేస్తున్నట్టు కౌన్సల్ జనరల్ ఉచియామా సీఎస్ కు వివరించారు.ఈఒప్పందంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ విద్యార్ధుల ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్ ప్రోత్సాహానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా గత ఒప్పందం అంశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. భారత దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 30వేల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ జపాన్ ఎండోవడ్ కోర్సెస్(జెఇసి)ను 2017లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్బికెఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏర్పాటు చేయాలని కొంత మంది విద్యార్ధులు జపాన్ నుండి ప్లేస్ మెంట్లు కూడా పొందారనే ఉచియామా సిఎస్ కు వివరించారు.

ఇండస్ట్రియల్ సెక్టార్లో మాన్యుఫ్యాక్చరింగ్ స్కిల్ ట్రాన్సఫర్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద జపాన్ భారతదేశాల మధ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జపాన్ కౌన్సల్ జనరల్ సిఎస్ కు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి డోడ్పాటును అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఈడిపి ప్రతినిధులు తదితురులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments