Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాం గిరి చేయను... ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (09:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలదాడి చేశారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు గుప్పించారు. 
 
జనసేన ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్‌ వ్యాపారం, జగన్‌కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందన్నారు. జగన్‌ను వరంగల్‌లో కొట్టి తరిమేశారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు ఇద్దరినీ రానివ్వరన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మిగిలిన పార్టీలవైపు వస్తుంటే.. చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి తాను దత్తపుత్రుడను కాదంటూ.. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు.. వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు, భయమూ లేదన్నారు. 'మీలా రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదు.. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని' అని అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments