Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులు : నాదెండ్ల మనోహర్

Webdunia
సోమవారం, 15 మే 2023 (11:48 IST)
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులకు ఆసక్తి చూపుతున్నట్టు జనసేన పార్టీ అధినేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అరాచకత్వం నుంచి ఏపీని విముక్తి చేయడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యమని, అందుకోసం ఏడాదిగా పొత్తుల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి మేలు జరిగేలా పొత్తులు ఉంటాయని తెలిపారు.

బీజేపీ, టీడీపీతో పొత్తులపై పవన్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సీట్లపై కాదు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఆరాచక, అవినీతి పాలనపైనే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేనాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర హితం కోసం పవన్ తీసుకునే నిర్ణయానికి పార్టీ శ్రేణులు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

జనసేన పార్టీ అవకాశవాద, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. మండల, పట్టణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. పవన్ రైతుల సంక్షేమం కోసం స్వంత నిధులు ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తన జేబులో నుంచి రైతుల కోసం ఒక్క రూపాయి ఖర్చుచేశారా? అని నిలదీశారు.

సీఎం జగన్ హెలికాఫ్టరులో తిరగడం తప్ప చేసిందేముంది? రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి 1.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పవన్ చేస్తున్న కృషిని అభినందించాల్సింది పోయి కొంతమంది చేత దుష్ప్రచారం చేయించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,000 కోట్లు ఉంటే కేవలం రూ. వంద కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments