Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ముద్ర లేకుండా చేయాలనే... జగన్‌ది ప్రతీకార పాలన : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిది ప్రతీకార పాలన అని జనసేన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పైగా, నవ్యాంధ్రలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముద్ర లేకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి ఆలోచనలు ఏమాత్రం మంచిదికాదన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు ఆంగ్ల పత్రికలు ఈ నెలలో రాసిన సంపాదకీయాలను ఆయన తెలుగులోకి అనువాదం చేసి ట్విటర్‌లో పోస్టు చేశారు. సీఎం జగన్‌వి తిరోగమన రాజకీయాలని, పరిపాలనలో ఆయనకు ఒక దృక్కోణం కావాలన్న శీర్షికలను కూడా పొందుపరిచారు. 
 
దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరైన 47 ఏళ్ల జగన్‌ రెడ్డి పరిపాలన భయాందోళన కలిగిస్తోందన్నారు. 'రాష్ట్రంలో చంద్రబాబు ముద్ర లేకుండా చేయాలని బాహాటంగానే చేపడుతున్న వరుస చర్యల్లో భాగంగా రాజధాని అమరావతిలో 6.84 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ స్టార్టప్‌ కోసం సింగపూర్‌ కన్సార్షియంతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నారు.
 
ఈ స్టార్టప్‌ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లే అండ్‌ ప్లగ్‌ కార్యాలయాల ఏర్పాటు పూర్తయి ఉంటే 50 వేల ఉద్యోగాలు లభించేవి. జగన్‌ ప్రభుత్వానికి చంద్రబాబు కోరుకున్న రీతిలో ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేని నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని చూడాలి' అని ఇంగ్లిష్‌ పత్రిక ప్రచురించిన కథనాన్ని పవన్‌ తెలుగులోకి అనువాదించి పోస్ట్‌ చేశారు. 
 
అలాగే, 'అమరావతిలో స్టార్టప్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, వర్తమాన భారతదేశానికి అత్యావశ్యకమైన పట్టణాభివృద్ధికి పెద్ద విఘాతం. ఈ నిర్ణయం భారత్‌లోని విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీసింది. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్‌ వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి' అని మరో పత్రిక రాసిన కథనాన్ని చూపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments