Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోళ్లు సింగపూర్-అమెరికాలను సైతం నాశనం చేస్తారు: ఎన్నారైలపై నోటికి పనిచెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మను.. జన్మభూమిని మర్చిపోకుండా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా చంద్రబా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (14:47 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మను.. జన్మభూమిని మర్చిపోకుండా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాను పని.. పని అనుకునేవాడినని కానీ.. ఇప్పుడు అది తప్పు అన్న విషయం తెలుసుకున్నానని చెబుతున్నారు. 
 
‘‘గతంలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని అధికారుల్ని పరుగులు పెట్టించా. కానీ అది తప్పు అని తెలుసుకున్నా. చేసే పని ఎంతైనా తృప్తిగా చేస్తేనే ఫలలితాలు వస్తాయి అని గుర్తించా. అందుకే నచ్చిన పనిని ఆనందంగా చేయాలని ఇప్పుడు పిలుపునిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు.
 
అయితే మీడియా మాత్రం ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బాబు ఏమన్నారంటే? ‘పని మీద అంకిత భావం ఉండదు. నిర్లక్ష్యం ఎక్కువ. సామాజిక కోణాలు పట్టించుకోరు. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మనోళ్లు సింగపూర్.. అమెరికాలను సైతం నాశనం చేస్తారు’’ అంటూ ప్రవాస భారతీయులపై ఘాటైన విమర్శలు చేశారని పేర్కొన్నారు.
 
విదేశాల్లో వ్యవస్థలపట్ల నిబద్ధతతో ఉండే ఎన్‌‍ఆర్ఐలు.. స్వదేశానికి వచ్చిన వెంటనే సామాజిక కోణం విస్మరించి విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు విమర్శించిన వైనాన్ని ప్రముఖంగా అచ్చేశారు. నిజానకి బాబు మాటల్లో సంచలన వ్యాఖ్యలు ఏమీ లేవనే చెప్పాలి. ఇలాంటి మాటల్నే ప్రతి ఒక్కరూ అంటారని మర్చిపోకూడదు. విదేశాల్లో ఆచితూచి వ్యవహరించే వారు.. సొంత దేశంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తున్నదే. ఇది ఇక్కడి వ్యవస్థ లోపమన్నది మర్చిపోకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments