Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా గొడవ సమసిపోయిందనుకుంటే మళ్లీ ఇలా తగులుకుందేమిటీ బాబో..: బాబు మల్లగుల్లాలు

ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని తుపానులు ఎదుర్కొన్నాను, ఎన్ని అవమానాల పాలయ్యాను.. ప్రజల వద్ద ఎన్ని భంగపాట్లకు గురయ్యాను. ఏదో నా అదృష్టం బాగుండి గోడకు కొట్టిన ప్రతిసారీ బంతిలాగా తిరగొచ్చి హోదా గొడవనుంచి తప్పించుకున్నానని ఊరడిల్లుతుంటే ఈ జల్లికట్టు నా ప్రా

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (04:28 IST)
ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని తుపానులు ఎదుర్కొన్నాను, ఎన్ని అవమానాల పాలయ్యాను.. ప్రజల వద్ద ఎన్ని భంగపాట్లకు గురయ్యాను. ఏదో నా అదృష్టం బాగుండి గోడకు కొట్టిన ప్రతిసారీ బంతిలాగా తిరగొచ్చి హోదా గొడవనుంచి తప్పించుకున్నానని ఊరడిల్లుతుంటే ఈ జల్లికట్టు నా ప్రాణం తీయడానికి వచ్చిందే అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతరంగంలో వాపోతున్నారు. ప్రత్యేక హోదా ద్రోహి అని అటు వైఎస్సార్సీపీ, ఇటు కాంగ్రెస్, తదిరత పక్షాలూ ఎండగడుతున్నా, ప్రతిసారీ ఎలాగోలా మసిపూసి మారేడు కాయ చేయడం కారణంగా సమసిపోయిందనుకుంటున్న ప్రత్యేకహోదా డిమాండ్ మళ్లీ ఊపందుకోవడంతో ఇప్పుడేం చేయాలో చంద్రబాబునాయుడుకు పాలుపోవడం లేదని తెలుస్తోంది
 
తమిళనాడులో సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టును నిషేధించడంతో వెల్లువలా వచ్చిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరకాటంలోకి నెట్టింది. వైకాపా వంటి రాజకీయ పార్టీల వ్యతిరేక ప్రచారాన్ని ప్రతి సారీ తట్టుకుని హోదా విషయంలో జారుకుంటున్న బాబుకు ఈ రెండున్నరేళ్ల కాలంలో తొలిసారి రాష్ట్ర యువత బలమైన సవాలు విసురుతోంది. మరికొద్ది గంటల్లో విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక హోదా ర్యాలీలు, మౌన దీక్షలు బాబు రాజకీయ అనుభవానికి సవాలు విసురుతున్నాయి. 
 
ప్రతిపక్షాల నుంచి కాకుండా కొత్తగా యువతీ యువకులనుంచి వస్తున్న ఈ సరికొత్త ఉపద్రవాన్ని డీల్ చేయడంలో ఏమాత్రం తప్పటడుగు వేసినా అది తన రాజకీయ భవితవ్యానికే ప్రమాదకరం అని బాబుకు అర్థమవుతోంది. ఒకటి రెండు రోజులు విద్యార్థులను ఆర్కే బీచ్ లోకి అనుమతిస్తే వారికి వారే శాంతిస్తారు, దీక్షలను ముగిస్తారు అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. మెరీనా బీచ్‌లో తమిళ యువత జల్లికట్టు దీక్ష ఎంత పనిచేసిందో కళ్లముందు కనుబడుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనే అగమేఘాల మీద పరుగులెత్తించిన శక్తిని జల్లికట్టు ఉద్యమం ప్రదర్శించింది. 
 
అందుకే సాగరతీరంలో ప్రత్యేక హోదా దీక్షలను అనుమతించామా. అది ఏ దశకు చేరుకుంటుందో, ఎలా పరిణమిస్తుందో అంచనా వేయలేని స్థితి. జగన్, ప్రతిపక్షాలు అనుకుంటే మధ్యలో ఈ పవన్ కల్యాణ్ నస భరించడం సాధ్యం కావడం లేదు.. ఏరోజు ఎప్పుడు తాను షూటింగుకు విరామం చెప్పి మైక్ అందుకుంటాడో, ఏ డైలాగు పేలుస్తాడో, ఎక్కడ అగ్గి రాజేస్తాడో అనే భయం ఇప్పటికే ఉంది. దానికి అదనంగా ఇప్పుడు ప్రత్యేక హోదా ద్రోహులు అంటూ అటు కేంద్రాన్ని, ఇటు తన నాయకత్వాన్నీ నేరుగా వేలెత్తి చూపుతూ పవన్ హోదా దీక్షలను సొంతం చేసుకున్నాడు. పోలీసు బలప్రయోగంతో అణిచివేస్తామా అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను ఎత్తేసుకోవలసిన ప్రమాదాన్ని కోరి ఆహ్వానించినట్లే అవుతుంది.
 
ఇదే ఇప్పుడు చంద్రబాబు అనే ఏపీ ముఖ్యమంత్రి అంతర్మథనం.  హోదా గొడవ సమసిపోయిందనుకుంటే మళ్లీ ఇలా తగులుకుందేమిటీ బాబో అంటూ చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారని వినికిడి. రేపేంది అని ఒక నాటకంలో పాత్రధారి అడిగినట్లుగా ఈ రోజు విశాఖ తీరంలో ఏం జరగనుందనే ప్రశ్న అటు బాబును, టీడీపీనీ, రాష్ట్ర ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న సమయంలో బాబుకు ఇవ్వాళ ఎదురవుతున్నది నిజమైన అగ్ని పరీక్షే. ఆర్కే బీచ్ లోకి ఎవరడుగు పెడతారో చూస్తాం అని విశాఖ పోలీసులు ఇప్పటికే సవాలు విసిరిన నేపథ్యంలో చంద్రబాబు ఈ అగ్నిపరీక్షలోంచి బయటపడతారా, ఎలా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments