Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి.. పొలంలోనే...

రైతులు తమకు అన్నం పెట్టే పంటపొలాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రైతు కన్నుమూశారు. నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్ల

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (09:55 IST)
రైతులు తమకు అన్నం పెట్టే పంటపొలాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రైతు కన్నుమూశారు. నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం రేకులపల్లిలో ఆదివారం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన రైతు పంజాల గంగాధర్‌(32) తనకున్న పొలంలో వరి సాగుచేసేందుకు నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పొలం నాటు వేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో నారు మడికి నీరుపెట్టేందుకు ఉదయం వెళ్లాడు. కరెంట్‌ లేకపోవడంతో మోటార్‌ ఆన్‌కాలేదు. దీంతో పంపులోకి కుండతో నీరు పోశాడు. ఈ క్రమంలోనే విద్యుత్‌ సరఫరా కావడంతో మోటార్‌ స్టార్టయ్యింది. పొలం నుంచి బయటకు వచ్చే క్రమంలో పైపును పట్టుకున్నాడు.
 
అప్పటికే మోటార్‌పంపు పైపునకువిద్యుత్‌ సరఫరా కావడంతో గంగాధర్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోనే ఉన్న అతని భార్య రజిత, వ్యవసాయకూలీలు గమనించి పెద్దగా కేకలు వేయడంతో మరికొందరు రైతులు సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. అయితే అప్పటికే గంగాధర్‌ మృతిచెందాడు. భార్య రజిత, కుమారుడు సిద్దు, కూతురు అక్షయ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments