ఏపీలో విద్యా కానుక ప్రారంభం.. సీఎం జగన్ భుజానికి స్కూలు బ్యాగు

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసింది. జగనన్న విద్యా కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ పథకం కింద రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందిస్తారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
 
ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
 
ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments