Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకే ఒక్కడు' : జగన్‌... 'సరిలేరు నీకెవ్వరు'....

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (15:00 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్ల వైకాపాకు చెందిన ఎమ్మెల్యే, నేతల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నవ్యాంధ్ర లేదా ఉమ్మడి ఆంధ్రదేశ్ లేదా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమంత్రి కింద ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్న దాఖలాలు లేవని అంటున్నారు.
 
గత నెల 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి జూన్ 8వ తేదీన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మొత్తం 25 మందితో ఆయన కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,  కాపు సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో ఒకరు బీసీ, మరొకరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. 
 
కానీ, ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా, దేశంలో ఈ తరహాలో ఇద్దరికి మించి ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన దాఖలులేవు. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురుని డిప్యూటీ సీఎంలుగా చేస్తున్నారు.
 
కాగా, ముగిసిన ఎన్నికల్లో వైకాపా 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 23 సీట్లు, జనసేన ఒక సీటుతో సరిపెట్టుకుంది. అలాగే, 25 ఎంపీ సీట్లలో వైకాపాకు 22, టీడీపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments