Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:41 IST)
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా చెబితే అలా తలాడిస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణ రాదు అని చెప్పినప్పటికీ అక్కడి యువత అంతా ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారనీ, అలాంటిది ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన మాటను మన యువత ఎందుకు సాధించుకోదో నిరూపిస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ యువతీయువకులతో కలిసి తమ పార్టీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధిస్తామన్నారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఢిల్లీలో ధర్నా చేస్తారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతదూరమయినా వెళ్తామన్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొన్న యువతీయువకులకు మైకులిచ్చి... మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమోనంటూ చెప్పారు. యువతీయువకులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments