Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హత్యకు మంత్రి దేవినేనే కారణం : వైఎస్ జగన్ ధ్వజం

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (09:17 IST)
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని గొట్టిముక్కల గ్రామంలో వైకాపా నేత కృష్ణారావు హత్యకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావే ప్రధాన కారకుడని స్థానిక గ్రామస్థులు చెపుతున్నారని అసెంబ్లీలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జగన్ వాడివేడిగా మాట్లాడారు. 
 
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రోద్బలంతోనే దాడులు, దౌర్జన్యాలు జరిగాయని గొట్టిముక్కల గ్రామ స్థానికులు ఆరోపించారని పేర్కొన్నారు. మొన్నటి వరకు 11 మంది హత్యకు గురయ్యారని, ఈ రెండురోజుల్లో మరో ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. శాంతి భధ్రతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మార్పు కోరుకుంటుంటే గతంలోకి వెళ్లి అవాస్తవాలు చెబుతున్నారని, చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో జరిగిన 14 హత్యలపై చర్చ జరగాలని తాము కోరుతుంటే టీడీపీ సభను తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని ఆరోపించారు. సభలో టీడీపీ తీరు చూస్తే ఇకపైనా వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తారనే భయం కలుగుతోందన్నారు. దురుద్దేశంతోనే పరిటాల రవి హత్యకేసులో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments