గవర్నర్‌ తో జగన్‌ భేటీ

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (19:29 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం జగన్‌ గవర్నర్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.

గవర్నర్‌ దంపతులకు మొదటగా సీఎం దంపతులు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై గత కొంతకాలంగా ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజధాని మార్పుపై గవర్నర్‌కు ప్రభుత్వం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల ఏర్పాటుపై గవర్నర్‌కు జగన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కాగా.. గవర్నర్‌ను మర్యాద పూర్వకంగానే సీఎం కలిశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్‌ను కలిశారు. రాయలసీమలో హైకోర్టు, రాజధాని మార్పు చర్చించారు.

అంతేకాకుండా రాజధాని రైతులు కూడా గవర్నర్‌ను కలిశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపడం ద్వారా తమను ఆదుకోవాలని రైతులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కోరారు.

సుమారు 40మంది రైతు ప్రతినిధులు కలిసి, తమ గోడును విన్నవించుకున్నారు. ఈ పరిణాల నేపథ్యంలో జగన్‌, గవర్నర్‌ను కలవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments