Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మా.. ఏంటీ లొల్లమ్మా..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (22:18 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల్లో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నేతలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. రోజా క్రిందిస్థాయి కార్యకర్తలతో హీనంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
సరిగ్గా కొన్నిరోజుల క్రితమే నాలుగు మండలాలు ఏదైతే ఉన్నాయో.. నిండ్ర, వడమాలపేట, పుత్తూరు, విజయపురంలకు చెందిన వైసిపి ఇన్‌ఛార్జ్‌లు ఒక్కటయ్యారు. రోజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎపి సిఎం జగన్ దృష్టికి రోజా వ్యవహార శైలిని తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. 

 
ఏకధాటిగా రోజాను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజా ఈసారి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులే ఓడిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఫ్లెక్సీల గొడవ మొదలైంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో భారీ ఫ్లెక్సీలను రోజా వ్యతిరేకులు ఏర్పాటు చేశారు.
 
అయితే ఆ ఫ్లెక్సీలను చించేశారు. రోజా ఆజ్ఞలతోనే ఫ్లెక్సీలను చించేశారంటూ మండిపడ్డారు రోజా వ్యతిరేకులు. రోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఇది కాస్త నియోజకవర్గంలో పెద్ద చర్చకు కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments