మోడీ అంటే జగన్ కు భయం: జేసీ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:37 IST)
"మోడీ అంటే జగన్ కు భయం. అందుకే ఆయన మాట మాత్రమే వింటాడు. ఆయన ఏమైనా జగన్‌‌ను చేస్తాడేమో అనే భయం. ఇంకెవ్వరి మాటా వినడు" అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "రాజకీయాల్లో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయి. బస్సుల జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి న్యాయస్థానం సలహా ఇచ్చినా వెంటనే రాజీనామా చేశారు.

151 మంది మెజార్టీ వచ్చినా రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాన్ని పరిపాలించాలి. నేనే రాజు నేను తప్ప ఎవ్వడు లేడు అనే పద్దతి ఉంది. రాష్ట్ర ప్రజలు ఏమి మాట్లాడుకుంటున్నారో ముఖ్యమంత్రి చూడాలి. ప్రజలను కన్వెన్స్ చేయాలి. అమరావతి రాజధాని కోసం అన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి పోలేకపోతే ఆయన సన్నిహితులు వెళ్లాలి. జగన్ పాలన చదువుకున్న వాళ్లకు అర్థం అయ్యింది. కాయా కష్టం చేసుకున్న వాళ్లకు ఇంకా అర్థం కాలేదు" అని జేసీ విమర్శల వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments