Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి ముప్పు... ఎంఫాన్ తుఫానుతో జాగ్రత్త.. సీఎం జగన్

Webdunia
సోమవారం, 4 మే 2020 (23:25 IST)
రాష్ట్రానికి ముప్పు పొంచివుందని.. ఎంఫాన్ తుఫాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తుఫాను వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. తుపాను వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
 
తుఫాను మన రాష్ట్రం వైపు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫానును దృష్టిలో ఉంచుకుని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. 
 
పంటలో మూడింట ఒక వంతును ప్రభుత్వమే కొనుగోలు చేస్తే... ధరల స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు. పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడకు పంపాలని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. 
 
ఇంకా, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారి ఏపీ దిశగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రెండో వారం నాటికి తుఫాను ఏపీ తీరం సమీపానికి రావొచ్చని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ తుపానుకు 'ఎంఫాన్' అని నామకరణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments