Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

సెల్వి
సోమవారం, 24 మార్చి 2025 (22:47 IST)
Jagan
"మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. అన్నీ మారుతాయి.." అని వైకాపా అధినేత జగన్ అన్నారు. కనురెప్పపాటులో ఒక సంవత్సరం గడిచిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ముందు రాబోయే మూడు సంవత్సరాలు కూడా అలాగే గడిచిపోతాయని అన్నారు.
 
గతవారం కుండపోత వర్షాల కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడటానికి పులివెందుల నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు జగన్ మాట్లాడుతూ.. మూడేళ్లలో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని, పరిస్థితులు చక్కదిద్దుతానన్నారు. 
 
అరటి రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు ఓపిక పడితే.. మన ప్రభుత్వం వస్తుందని.. ప్రతీ రైతుకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తానన్నారు. అకాల వర్షాలకు దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం రైతులకు ఇన్యూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదు కోవాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. 
 
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ధ్వజమెత్తారు. వర్ షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడిందని చెప్పుకొచ్చారు. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదని వివరించారు. 
 
వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేసామని చెప్పారు. అరటి సాగులో ఏపీ లోనే పులివెందుల నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments