Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచెకట్టులో కనిపించే హరీష్ రావు చీషర్ట్ వేస్తే.. మహేష్ బాబే: జబర్ధస్త్ అదిరే అబి

ఎప్పుడూ పంచెకట్టుతో కనిపించే మంత్రి హరీష్ రావు టీ షర్టులో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నారని జబర్దస్త్ షో హాస్య నటుడు అదిరే అభి కితాబిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మంత్రి హరీష్ జన్మదినాలను

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (15:18 IST)
ఎప్పుడూ పంచెకట్టుతో కనిపించే మంత్రి హరీష్ రావు టీ షర్టులో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నారని జబర్దస్త్ షో హాస్య నటుడు అదిరే అభి కితాబిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మంత్రి హరీష్ జన్మదినాలను పురస్కరించుకుని శనివారం రాత్రి సిద్ధిపేటలోని కోమటి చెరువు వద్ద తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వేడుకల్లో అదిరే అబి హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు.
 
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట హారతి పట్టిందని, ఉద్యమానికి దిక్సూచిలా నిలబడిందన్నారు. అభివృద్ధిలోనూ అలాగే ఉందన్నారు. వీ6 ఫేమ్‌ బిత్తిరి సత్తి, సావిత్రి సిద్దిపేట పట్టణం, మండలంలోని ఇబ్రహీంపూర్‌, జిల్లా గొప్పతనాన్ని వివరించారు. మరోవైపు గద్దర్‌లా పాటపాడిన సత్తి అదరగొట్టారు.
 
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన 19 ఏళ్ల ఒడిశా యువతిని నిమిషాల్లో ఆదుకున్నారు. అర్ధగంటలోనే ఆమె శస్త్రచికిత్సకు సాయం అందించారు. రష్మిత అనే యువతి ఒడిశా నుంచి వచ్చి హైదరాబాద్‌లోని కాల్‌ హెల్త్‌ అనే సంస్థలో పని చేస్తున్నారు.
 
జీడిమెట్ల ప్రాంతంలో రష్మిత శనివారం ఉదయం బస్సులోంచి జారి పడి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆమెను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆమెకు, ఆమె కుటుంబానికి అంత స్తోమత లేకపోవడంతో రాబిన్‌ అనే సహోద్యోగి ట్విటర్‌లో ఈ సమాచారాన్ని కేటీఆర్‌కు, ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఒడిశా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను చూసి స్పందించి ఆసుపత్రికి తమ సిబ్బందిని పంపించి, వెంటనే ఆపరేషన్ చేయాలని, అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments