Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (20:31 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు అంశాలు..
 
1. వివిధ పథకాలకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక, వారికి మంజూరుపై కేబినెట్లో నిర్ణయం
అర్హులైన వారికి సంతృప్తకర స్థాయిలో పథకాలు వర్తింపుచేసేలా స్థిరమైన విధానానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
ఇళ్లపట్టాలు, వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ, బియ్యంకార్డులు, పెన్షన్‌ కార్డులపై సంవత్సరం మొత్తంకూడా దరఖాస్తుల స్వీకరణ
ఇళ్లపట్టాలు 90 రోజుల్లో, ఆరోగ్యశ్రీ, బియ్యంకార్డులు, పెన్షన్‌ కార్డులకు 21 రోజుల్లో వెరిఫికేషణ్‌ పూర్తిచేసి అర్హత నిర్ధారించనున్న ప్రభుత్వం

- ప్రతి ఏటా 2 సార్లు కొత్తగా మంజూరు చేసిన వారికి నిధుల విడుదల
- అమలు తేదీకి రెండు నెలలముందు లబ్ధిదారుల జాబితా సామాజిక తనిఖీల కోసం ప్రదర్శన
- వారం ముందు లబ్ధిదారుల తుది జాబితా విడుదల
- డిసెంబర్‌, జూన్‌ల్లో కొత్తగా ఎంపికచేసిన అర్హులైన లబ్ధిదారులకు నిధులు విడుదల
- అలాగే వివిధ పథకాల అమలు తర్వాత మిస్‌ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు నెలరోజులపాటు అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం
- ఈ దరఖాస్తుల్లో కూడా అర్హులైన వారికి జూన్‌, డిసెంబరుల్లో నిధులు విడుదలచేయనున్న ప్రభుత్వం
సంతృప్తకర స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించే స్థిరమైన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
 
2. పిల్లలను బడికి పంపేలా ‘అమ్మ ఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగింపుపై మంత్రివర్గంలో చర్చ
దీంట్లో భాగంగా అమ్మ ఒడి పొందాలంటే 75శాతం హాజరు ఉండాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం
కోవిడ్‌ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు ఈ నిబంధనను అమలు చేయలేకపోయిన ప్రభుత్వం
పనిదినాల్లో 75శాతం హాజరును పరిగణలోకి తీసుకుని 2021-22 విద్యాసంవత్సరం అమ్మ ఒడిని జూన్‌, 2022 అమలు చేయనున్న ప్రభుత్వం
అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15వేల రూపాయలను తల్లులకు ఇస్తున్న ప్రభుత్వం
 
3. బీసీ కులాల వారీగా జన గణన చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం
అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయం
ఆర్థికంగా, సామాజికంగా ఆయా వర్గాల అభ్యున్నతికి ఈ గణాంకాలు దోహపడతాయన్న ప్రభుత్వం
వారి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఈ గణన తోడ్పడుతుందన్న మంత్రివర్గం
మేథావులు, వివిధ బీసీ సంఘాలు, వివిధ సంస్థల డిమాండ్‌ మేరకు బీసీల వారీగా జన గణన చేయాలన్న కేబినెట్‌
 
4. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు భారీగా పోస్టుల భర్తీని చేపడుతున్న ప్రభుత్వం
అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియామకం చేస్తున్న ప్రభుత్వం
దీంట్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
పబ్లిక్‌ హెల్త్‌ , ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని 1285 పోస్టులను కొత్తగా సృష్టించేందుకు కేబినెట్‌ ఆమోదం
వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌లో 560 గ్రేడ్‌ 2 ఫార్మసిస్ట్‌ పోస్టులను కొత్తగా సృష్టించేందుకు కేబినెట్‌ అంగీకారం
 
 
5. వైద్య ఆరోగ్యశాఖలో వైద్య విద్య విభాగంలో అదనంగా 2190 బోధనా సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం. బోధనాసుపత్రుల్లో ఈ సిబ్బంది నియామకం.
 
మరిన్ని వివరాలు:
వైద్య, ఆరోగ్యం – కుటుంబ సంక్షేమ శాఖలో జూన్‌ 2019 నుంచి 43,953 సిబ్బందిని జోడించిన ప్రభుత్వం
 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సేవలందించడానికి ఇప్పటికే 12,936 ఏఎన్‌ఎం గ్రేడ్‌-3 పోస్టులను భర్తీచేసిన ప్రభుత్వం
గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి 10032 విలేజ్‌ క్లినిక్స్‌లో, క్లినిక్‌కు ఒకరు చొప్పున మొత్తంగా 10032 పోస్టులు మంజూరు
దీనికి సంబంధించి ఇవాళ 7390 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. వీటితోపాటు  కేవలం 2 నెలల కాలంలో 4035 పోస్టులను భర్తీచేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
2021 నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే 11,425 పోస్టులను భర్తీచేయనున్న ప్రభుత్వం.
 
6. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
అక్కచెల్లెమ్మలకు, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా పాడిపరిశ్రమ అభివృద్ధి
పాల కొలత, నాణ్యత నిర్ధాణలో మోసాలు అరికట్టేందుకు చర్యలు
పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధకశాఖకు బదిలీ
వెటర్నరీ డాక్టర్లకు నేరుగా తనిఖీలు చేసే అధికారం
పాడిరైతులు మోసాలకు గురికాకుండా చూసేందుకే ఈ నిర్ణయమన్న కేబినెట్‌
 
7.ప్రభుత్వంలో కొత్త శాఖ ఏర్పాటు
ఈడబ్ల్యుఎస్‌ వెల్ఫేర్‌ శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
 
8. రాష్ట్రంలోని జైనులు, సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ల ఏర్పాటకు కేబినెట్‌ ఆమోదం
వీరి సంక్షేమం కోసం తోడ్పడనున్న కార్పొరేషన్లు
రాష్ట్రంలో 27 వేలమంది జైనులు, 10వేలమంది సిక్కులు ఉన్నట్టు అంచనా
 
9. నవంబర్‌ 1న వైయస్సార్‌ లైఫ్ టైం అచీవ్‌మెంట్‌, వైయస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, కేబినెట్‌ ఆమోదం
ఇకపై ప్రతిఏటా నవంబర్‌ 1న వైయస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌, వైయస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు
 
10. మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బందికి కేబినెట్‌ ఆమోదం
 
11. మావోయిస్టుల సహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
 
12. ఆంధ్రప్రదేశ్‌ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం 1955 సవరణకు కేబినెట్‌ ఆమోదం
ఆర్డినెన్స్‌ జారీచేయనున్న ప్రభుత్వం
సీమ్‌లెస్‌ ఆన్లైన్‌ మూవీ టిక్కెట్స్‌ బుకింగ్‌ సిస్టంకు కేబినెట్‌ ఆమోదం
ఇండియన్‌ రైల్వే ఆన్లైన్‌ టిక్కెట్‌ వ్యవస్థ తరహాలో విధానం
పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్న ఏపీఎఫ్‌డీసీ
ఆన్లైట్‌ మూవీ టిక్కెట్లపై ఆగస్టులో నిపుణుల కమిటీని కూడా నియమించిన ప్రభుత్వం
ప్రేక్షకులకు సౌకర్యంగా ఆన్‌లైన్‌ పద్దతుల్లో సినిమా టిక్కెట్లు
ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌, ఎస్‌ఎంస్‌లద్వారా టిక్కెట్లను బుక్‌చేసుకునే సౌకర్యం
థియేటర్ల వద్ద ట్రాఫిక్‌ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదాయం చేయడానికి, పన్నులను ఎగ్గొట్టడాన్ని నివారించడానికి కొత్త విధానం దోహదపడుతుందన్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 1094 థియేటర్లు 
 
13. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
అగ్నిమాపక కేంద్రంలో కొత్తగా 19 పోస్టులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
 
 
14. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరాకోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు
పగటిపూటే కరెంటు సరఫరాకోసం చర్యల్లో మరింత ముందడుగు 
 
కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
యూనిట్‌ కరెంటు కేవలం రూ.2.49లకే కొనుగోలు చేస్తూ  ఒప్పందం 
ఏడాదికి 7వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేయనున్న ప్రభుత్వం
సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఇండియా ద్వారా తక్కవ ఖర్చుకే కొనుగోలు కారణంగా ఏటా దాదాపు రూ.2వేలకోట్లు ఆదాచేయనున్న ప్రభుత్వం
 
దీంతోపాటు ఏపీ రూరల్‌ ఏపీజీఈసీఎల్‌ పేరును ఏపీ రూరల్‌ ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ సప్లై కంపెనీగా మార్పు
రైతులకు పగిటపూటే 9 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ అందించనున్న రూరల్‌ అగ్రికల్చర్‌ సప్లై కంపెనీ
 
15. విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసతో విశాఖ శారదా పీఠంకు 15 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం
సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆథ్మాత్మిక కార్యక్రమాలను విస్తరించనున్న శారదాపీఠం
మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరా రూ. 1.5 కోట్ల చొప్పున కేటాయింపు
 
16. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో 17.49 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
జయలక్ష్మి నరసింహశాస్త్రి, గుండ్లూరు ట్రస్ట్‌కు ఈభూమిని కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌
వేద పాఠశాల, సంస్కృత పాఠశాలను ఏర్పాటుచేయనున్న ట్రస్టు
 
17. నగరిలో ఏరియా ఆస్పత్రికోసం ప్రభుత్వ భూమి మార్పిడికి కేబినెట్‌ ఆమోదం
 
18. కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో క్లస్టర్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు 50 ఎకరాల ప్రభుత్వం భూమి బదలాయింపునకు కేబినెట్‌ ఆమోదం
 
19. కృష్ణా జిల్లా నూజీవీడు మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల భూమి విద్యాశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్‌ ఆమోదం
 
20. వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణను దేవాదాయశాఖ నుంచి తిరిగి వారికే అప్పగించే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం
ఆర్యవైశ్య సామాజికవర్గ వినతి మేరకు వారికి అప్పగించాలని నిర్ణయం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అప్పగిస్తూ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
 
21. రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు కీలక నిర్ణయం
ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిసిన ఎస్‌ఐపీబీ
 
చిత్తూరు జిల్లాలో పేరూరు, విశాఖపట్నంలో భీమిలి మండలం అన్నవరం, కపడజిల్లాలో గండికోట, చిత్తూరులో హార్సిలీ హిల్స్‌, తూర్పుగోదావరిజిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమి అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోదం
7 స్టార్‌ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు
ఈ ఐదు రిసార్ట్‌లను ఓబెరాయ్‌ విలాస్‌ పేరుతో ఏర్పాటు నిర్మించనున్న ఓబెరాయ్‌
దాదాపు రూ.1350 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్న ఓబెరాయ్‌
10,900 మందికి ఉద్యోగాల కల్పన
 
భీమిలిలో రూ.350 కోట్లతో ఏర్పాటు చేయనున్న మరో టూరిజం ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం. 7 స్టార్‌ సదుపాయాలు 5500 మందికి ఉద్యోగాలు
 
తిరుపతిలో రూ.250 కోట్ల టూరిజం ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం. 1500 మందికి ఉద్యోగాలు… 
చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం
 
22. అనంతపురం జిల్లా పెనుగొండలో ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం
లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు
 
23. విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విశాఖలో తాజ్‌ వరుణ్‌బీజ్‌ వద్ద టూరిజం  ప్రాజెక్టుకు, విజయవాడలో హోటల్‌ హయత్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం
టూరిజం పాలసీలో భాగంగా వారికి పలు రాయితీలు వర్తింపు
 
24. ఏపీ గూడ్స్‌ మరియు సర్వీస్‌ టాక్స్‌ ఆర్డినెన్స్‌ సవరణలకు కేబినెట్‌ ఆమోదం
 
25. ప్రకాశం జిల్లా వాడరేవులో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పరిపాలనా అనుమతులకు కేబినెట్‌ ఆమోదం
 
26. విశాఖపట్నంలో మధురవాడలో అదానీ ఎంటర్‌ ప్రైజస్ ఆధ్వర్యంలో 200 మెగావాట్ల డాటా సెంటర్‌ పార్క్‌, బిజినెస్‌ పార్క్‌, స్కిల్‌ యూనివర్శిటీలకు 130 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
రూ. 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ
ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు 
 
27. వైయస్సార్‌ కడప జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులకు జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌స్‌కు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు కేబినెట్‌ ఆమోదం
మొత్తం 5 లిఫ్టులను 227.1 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
 
28. మూడు కొత్త ఆక్వాకల్చర్‌ ప్రాజెక్టుల కోసం 73 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం
6 రెగ్యులర్‌ పోస్టులు డిప్యూటేషన్‌ పద్ధతిలో భర్తీకి, 67 అవుట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీకి కేబినెట్‌ ఆమోదం
 
29. విజయనగరంలో జేఎన్టీయూ కాలేజీని యూనివర్శిటీగా మారుస్తూ గతలో కేబినెట్‌ నిర్ణయం
దీనికి జేఎన్డీయూ గురజాడ యూనివర్శిటీగా నామకరణానికి కేబినెట్‌ ఆమోదం
దీనిపై ఆర్డినెన్స్‌ జారీచేయనున్న ప్రభుత్వం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments