Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రామ్మోహన్‌ రావు బంధువు ఇంటిపైనా ఐటీ దాడులు

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపార

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:44 IST)
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు రామ్మోహన్‌ రావుకు చెందిన వియ్యంకుడు చిత్తూరులోని బద్రినారాయణ ఇంటిపై కూడా దాడులు జరిపారు. చెన్నైకి చెందిన ఐటీ అధికారులు నేరుగా చిత్తూరు నగరంలోని బద్రి నారాయణ ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. తమిళనాడు సిఎస్‌ కుమారుడికి బద్రి నారాయణ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
ఈ నేపథ్యంలో బద్రి నారాయణ ఇంటిలోను రామ్మోహన్‌ డబ్బులు దాచి ఉంచాడేమోనన్న అనుమానంతో దాడులు జరుపుతున్నారు. అయితే మీడియాను లోపలికి అనుమతించడం లేదు. వివరాలను కూడా ఐటీ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. 10 మందికి పైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments