Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ఢిల్లీ కాదు.. వారిది ఆప్ కాదు.. పోటీచేస్తే టీడీపీ గల్లంతే : జగన్

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (07:37 IST)
ఇక్కడున్నది ఢిల్లీ కాదనీ, తెలుగుదేశం పార్టీ గొప్పలు చెబుతున్నట్లు వారున్నది ఆమ్ ఆద్మీ పార్టీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ ఆర్ పార్టీ నాయకుడు జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గురువారం అనంతపురంలో ఆయన రైతు భరోసా యాత్రను ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందన్నారు. అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపికి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు  మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టక నిలువునా మునిగిపోయారన్నారు. కేవలం వడ్డీభారం రూ. 12 వేల కోట్లు రైతులపై పడిందని దీనికి కారణం బాబేనని మండిపడ్డారు.
 
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును బ్యాంకులు రుణాల ఖాతాలకు జమ చేసుకుంటున్నాయని డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని,  జగన్ అన్నారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దక్కలేదని చెప్పారు. ఏపీలో గత సీజన్లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments