Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజీ కాదు హోదానే కావాలి.. లేదంటే బతుకు బస్టాండే: టీడీపీ లోక్‌సభ సభ్యుల మనోగతం

జనంలోకి వెళ్లి ఓట్లు అడిగే తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు ఇపుడు ఓ గుబులు పట్టుకుంది. అదే ప్రత్యేక హోదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్ల

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (09:42 IST)
జనంలోకి వెళ్లి ఓట్లు అడిగే తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు ఇపుడు ఓ గుబులు పట్టుకుంది. అదే ప్రత్యేక హోదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల మధ్యకెళ్లి ఓట్లు అడగలేమన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
ఏపీకి హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేశారు. దీనిపై లోక్‌సభ సభ్యులు మండిపడుతున్నారు. 'హోదాను ఏపీ ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ప్యాకేజీతో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదు. అలాంటపుడు ఎన్ని నిధులు ఇచ్చినా అనవసరమే' అని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ముఖ్యంగా 'ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాల్సిన అవసరం లేని వారంతా రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. వారు రాజ్యసభ సభ్యులుగా నెట్టుకొస్తుంటారు. మా పరిస్థితి అలాకాదు. మేం మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి. జైట్లీతోపాటు ప్యాకేజీ చర్చల్లో పాల్గొంటున్న వెంకయ్య, సుజనా, సీఎం రమేశ్‌ అందరూ రాజ్యసభ సభ్యులే. అందుకే వారికి ప్రజాభిప్రాయం పట్టడం లేదు' అని ఉత్తరాంధ్ర ఎంపీ ఒకరు అన్నారు. 
 
మరోవైపు అరుణ్ జైట్లీతో ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై గురువారం కూడా చర్చలు కొనసాగాయి. ఈ చర్చల్లో వెంకయ్య, సీఎం రమేశ్‌, సుజనాతోపాటు విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు కూడా పాల్గొన్నారు. చర్చల్లో చాలావరకు పురోగతి ఉందని, 75 శాతం మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కలను కేంద్రం అంగీకరించిందని, మిగిలిన 25 శాతం లెక్కలపై మాత్రం కేంద్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒకటిరెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది ప్యాకేజీని సిద్ధం చేయాలని జైట్లీ కోరినట్టు వినికిడి. మొత్తంమీద ప్రత్యేక ప్యాకేజీ అంశం టీడీపీకి చెందిన లోక్‌సభ్యుల్లో ఆందోళన రేకెత్తిస్తుంటే.. రాజ్యసభ సభ్యులు మాత్రం ఏదో విధంగా సమస్యకు పరిష్కారం లభిస్తే చాలన్న ధోరణితో ఉన్నారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులపై లోక్‌సభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

ఒగ్గు కథ నేపథ్యంలో సాగే బ్రహ్మాండ ఫస్ట్‌లుక్‌ను రవీందర్‌రెడ్డి ఆవిష్కరించారు

తెలుగులో హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ఏజెంట్ గై 001 ట్రైలర్

నా డ్రీమ్‌ డైరెక్టర్‌ ఈ భూమ్మీద లేరు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments