Webdunia - Bharat's app for daily news and videos

Install App

12న షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం: ఇస్రో ప్రకటన

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:00 IST)
నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 12న సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు ఉపకరించే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌-3 అనే ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపుతున్నారు. 
 
2,268 కిలోల బరువు కలిగిన ఈ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను (దూర పరిశీలనా ఉపగ్రహం) భూస్థిర కక్ష్యలోకి మొట్టమొదటిసారిగా పంపిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 సిరీస్‌లో ఇది 14వ ప్రయోగం. 
 
2020 జనవరి నెలలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది కరోనా వల్ల ప్రయోగాలన్నీ వాయిదా పడ్డాయి. అవరోధాలన్నీ అధిగమించి ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments