Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు GSLV-D6 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (09:23 IST)
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ మరో కీలక ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ షార్ సెంటర్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ డి6 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా 2,117 కిలోల బరువు కలిగిన జీశాట్-6 సమాచార ఉపగ్రహాన్ని భూసమాంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 
 
ఇందుకోసం బుధవారం ఉదయం గం.11.52 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రీ కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఆయన నేతృత్వంలో వందలాది మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 
 
ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని డిజిటల్ మల్టీమీడియా సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి రానుంది. ఈ ఉపగ్రహంలో ఐదు సి- బాండ్, ఎస్ -బాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ను అమర్చారు. తొమ్మిదేళ్ల పాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం ద్వారా కొంత మేర మన దేశానికి ట్రాన్స్‌పాండర్ల కొరత తీరనుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments