Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో... 29న జీఎస్ఎల్వీ-ఎఫ్08

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08ను అంతరిక్షంలోకి పంపనుంది.

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (13:56 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే జీశాట్-6ఏ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ గురువారం ప్రత్యేక వాహంలో తీసుకొచ్చారు.
 
ఈ ప్రయోగానికి సంబంధించి రెండో ప్రయోగ వేదిక రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవేత్తలు పూర్తిచేశారు. 2,140 కిలోల బరువు గల జీశాట్-6ఏ ఉపగ్రహం సమాచార రంగానికి చెందింది. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో ఈ ఉపగ్రహ ప్రయోగం చేపడుతుంది. ఇది విజయవంతమైతే పదేళ్ల పాటు సేవలు అందించనుంది. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే మార్చి 29వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్08ను నింగిలోకి పంపించనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments