Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GSLV-F10 : జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (07:41 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో జీఎల్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 
 
రాకెట్‌ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది. 
 
మంగళవారం ఇస్రో చైర్మన్‌ శివన్‌ నేతృత్వంలో షార్‌లో మిషన్‌ సంసిద్ధత సమావేశం జరిగింది. దశల వారీగా రాకెట్‌ అనుసంధానంపై సమీక్షించారు. సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు.
 
అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. ఈ క్రమంలో ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా.. 26 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం గురువారం ఉదయం జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments