Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించిన సోము వీర్రాజు.. సున్నితంగా తిరస్కరణ..!

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (23:10 IST)
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అయిన తరువాత సోము వీర్రాజు కొంతమంది ప్రముఖులను కలుస్తున్నారు. ముఖ్యంగా బిజెపితో సఖ్యతగా ఉన్న వారు.. తనకున్న పరిచయాలున్న వ్యక్తులతో కలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవితో సోము వీర్రాజు భేటీ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను చిరంజీవి గారు. మీ ఆశీస్సులు కావాలంటూ వెళ్ళారు సోము వీర్రాజు. అయితే సుమారు అరగంట పాటు చిరుతో భేటీ అయిన తరువాత సోము వీర్రాజు ఏకంగా ఆయన్ను బిజెపిలోకి ఆహ్వానించారట. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపిలోకి మీలాంటి వారి రాక అవసరం.
 
ప్రస్తుతం మీ తమ్ముడితో మేము రాష్ట్రంలో జతకట్టాము. కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాము. మీరు కేంద్రమంత్రిగా పనిచేశారు. మీకు రాష్ట్ర పరిస్థితులు బాగా తెలుసు. అందుకే మీలాంటి వారి రాక కోసం మేము ఎదురుచూస్తున్నామంటూ చిరుతో ఓపెన్ అయిపోయారట సోము వీర్రాజు.
 
కానీ చిరంజీవి మాత్రం సున్నితంగా ఆ విషయాన్ని పక్కన బెట్టారట. ప్రస్తుతం రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఆలోచన అస్సలు లేదని.. సినిమాల్లోనే బిజీగా ఉన్నానని.. నాపై నమ్మకంతో పిలిచినందుకు ధన్యవాదాలని చిరంజీవి సోము వీర్రాజుకు చెప్పారట. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments