Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (20:29 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి వేధించిన కేసులో విజయవాడ పూర్వ కమిషనర్ కాంతిరాణా టాటాకు అరెస్టుభయం పట్టుకుంది. దీంతో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతా ఆయన శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు అంశంలో నాటి నిఘా విభాగం ఐజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశాల్ గున్నిలు కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పైపెచ్చు, వీరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాంతి రాణా పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం అంటే ఈ నెల 23వ తేదీన విచారణ చేపట్టనుంది. కాగా, నటి కాందబరి జెత్వానీపై అక్రమ కేసు, నిర్బంధం, వేధింపుల అంశాల్లో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై ఆరోపణలు రాగా, డీజీపీ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెండ్‌కు అనుమతిచ్చారు. దీంతో ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments