Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (20:16 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జగన్ సర్కార్ ముందడుగు వేసింది. రివర్స్ టెండరింగ్  వల్ల  నష్టమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సూచనను కూడ లెక్క చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు పిలిచింది. 
 
పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రాల్లో పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. రూ. 4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. హెడ్ వర్క్స్‌కు  రూ. 1800 కోట్లు, జల విద్యుత్ పనులకు 3100 కోట్లకు టెండర్లను పిలిచారు.
 
 పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనుల్లో  రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పీపీఏ  సీఈఓ లేఖ రాశాడు. ఈ లేఖను కూడ ఖాతరు చేయకుండా రివర్స్ టెండరింగ్ కు  ఏపీ సర్కార్  శనివారం నాడు టెండర్లను ఆహ్వానించింది.
 
 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో  ప్రజా దనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆచరణలో చూపెట్టనున్నట్టుగా వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు.
 
 పీపీఏల రద్దు విషయంలో కూడ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసినా కూడ ఏపీ సర్కార్ పీపీఏలను రద్దు చేసింది. పీపీఏల తరహాలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో  రివర్స్ టెండరింగ్ విధానానికే జగన్ సర్కార్ మొగ్గు చూపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments