Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు కొట్లాట : ఆయనేం సీఎంకాదూ.. ప్రెసిడెంటూ కాదు.. లోకేశ్‌పై టీజీ వ్యంగ్యాస్త్రాలు

ఇటీవల కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సీటుకు, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు కర్నూలు జిల్లా టీడీపీలో చిచ్చురేపింది. నారా లోకేశ్‌

Webdunia
బుధవారం, 11 జులై 2018 (16:37 IST)
ఇటీవల కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సీటుకు, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు కర్నూలు జిల్లా టీడీపీలో చిచ్చురేపింది. నారా లోకేశ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనదైనశైలిలో స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్.. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తనకు ఏమాత్రం అంతుచిక్కడం లేదన్నారు. అయితే, తనకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఆయనదే తుది నిర్ణయమన్నారు. 
 
పైగా, అభ్యర్థులను ప్రకటించిన నారా లోకేశ్ పార్టీకి అధ్యక్షుడు కాదు.. ముఖ్యమంత్రికాదని గుర్తుచేశారు. అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి.. మంత్రి లోకేశ్‌ను హిప్నటైజ్ జేసి అలా ప్రకటన చేయించేలా చేసివుంటారని, ఎందుకంటే మా మోహనుడుకి ఆ టాలెంట్ ఉందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఏది ఏమైనా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం తుది నిర్ణయం తీసుకున్నాక దానిపై స్పందిస్తానని అన్నారు. ఎప్పుడైనా బీఫామ్ ఇచ్చే ముందు చంద్రబాబు అభ్యర్థి ప్రకటన చేస్తారని, కానీ లోకేష్ ముందుగానే ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదని తెలిపారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు. 
 
కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక పోటీ నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments