Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొలుసు దొంగలు కాదా? అమ్మే ఆ పసికందును చంపేసిందా?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2016 (15:47 IST)
హైదరాబాదులో గొలుసు దొంగల దాడిలో గాయపడి చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడుమెట్‌ ఆర్కేపురంలో జరిగిన ఈ పసికందు మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆర్కేపురంకు చెందిన పూర్ణిమ మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తన 25 రోజుల కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరింది. 
 
మార్గమధ్యంలో ఎదురుగా బైక్ పైన వచ్చిన ఇద్దరు గొలుసు దొంగలు పూర్ణిమపై స్ప్రే చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపారు. పూర్ణిమ ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. దొంగలు దాడిచేసి గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటనలో పూర్ణిమ చంకలో ఉన్న పసికందు గొంతుకు తీవ్రగాయామైంది. ఘటన నుంచి తేరుకున్న పూర్ణిమ భర్త శ్రీధర్‌తో కలిసి పసికందును తార్నాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
 
అక్కడ చికిత్స పొందుతూ పసికందు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, 25 రోజుల పసికందును తల్లే హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపైన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నారు. 
 
పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన చెప్పిన వివరాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంటిని తనిఖీ చేయడంతో రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments